Showing posts with label మా. Show all posts
Showing posts with label మా. Show all posts

Wednesday, 9 November 2011

జెనీలియా, సమంతా, త్రిష, శ్రియలకు టెన్షన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోని హీరోయిన్లకు డెడ్ లైన్ దగ్గరపడింది. ఈనెలాఖరులోగా మా లో సభ్యత్వం తీసుకోకపోతే... నిషేధం విధిస్తామని మా అధ్యక్షుడు మురళీమోహన్ హెచ్చరించారు. తెలుగు చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాలో సభ్యత్వం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే సమయం దగ్గరపడింది. ఈనెలాఖరులోగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోకుంటే నిషేధానికి గురవుతారని మా అధ్యక్షుడు మురళీ మోహన్ హెచ్చరించారు. ఇప్పటికే సభ్యత్వం లోని హీరోయిన్లకు నోటీసులు పంపించారు. 
వీరిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న జెనీలియా, సమంతా, త్రిష, శ్రియ ఉన్నారు. వీరితో పాటు నిత్యామీనన్, స్నేహా లాంటి హీరోయిన్స్ చాలామందే ఉన్నారని సమాచారం. ఇప్పటికే నోటీసులు పంపినా... సదరు హీరోయిన్స్ సభ్యత్వం తీసుకోకపోవడంపై మా చాలా సీరియస్ గా ఉంది. వీరిపై ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే... చివరి అవకాశంగా ఈ నెలాఖరు వరకు సమయమిచ్చారు. ఈలోగా మెంబర్ షిప్ తీసుకోకపోతే ఇక టాలీవుడ్ కి పూర్తిగా దూరమౌతారని మా ఘాటుగా హెచ్చరించింది. మరి ఈ డెడ్ లైన్ పై హీరోయిన్స్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి