Showing posts with label మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి. Show all posts
Showing posts with label మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి. Show all posts

Thursday, 1 March 2012

జగన్ సిఎంగా ఉంటే బాగుండేది ...డిఎల్ రవీంద్రా రెడ్డి

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు మదనపడుతున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒరిగిందేమీ లేదని అనుకుంటున్నారని ఆయన అన్నారు.మూడు నెలల్లో ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. వారం రోజుల్లో 130 పిహెచ్‌సిలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని కానీ మందుల కొరత మాత్రం లేదని చెప్పారు. మందులు అన్ని ఆసుపత్రులలో దొరుకుతున్నాయని చెప్పారు. 
 

Sunday, 26 February 2012

రాజీనామాకు మంత్రి డిఎల్ రెడీ?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. మంత్రి పదవికి మాత్రమే కాకుండా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడానికి అనుమతించాలని కోరుతూ ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో రాజీనామా చేయడానికి అనుమతించాలని ఆయన సోనియాను కోరారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, పథకాల వల్ల ప్రస్తుత ప్రభుత్వం విశ్వసనీయతను, ప్రతిష్టను కోల్పోయిందని ఆయన ఆ లేఖలో విమర్శించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రవీంద్రా రెడ్డితో మాట్లాడినట్లు, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు సెలవులో ఉన్న మంత్రి శుక్రవారం శాసనసభకు హాజరయ్యారు. ఆ తర్వాత కడప జిల్లాకు వెళ్లిపోయారు. సోమవారం కూడా ఆయన సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రభావాన్ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో విమర్సించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరికి, నిర్లక్ష్యానికి సంబంధించిన పలు సంఘటనలను కూడా ఆయన లేఖలో ఉదహరించినట్లు సమాచారం.

Tuesday, 7 February 2012

శాఖల మార్పులపై కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్...డీఎల్ రవీంద్రారెడ్డి

 శాఖల మార్పులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను పనిచేయడం లేదని శాఖల్లో కోత వేసి ఉంటే తనకు మంత్రి పదవే అక్కర్లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, చేయనుకూడా అని డీఎల్ పేర్కొన్నారు. పథకాల వైఫల్యం, అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని డీఎల్ స్పష్టం చేశారు. జూడాల విషయంలో తన వైఫల్యం లేదని, వచ్చే ఉప ఎన్నికల్లో తన ప్రమేయము ఉండదని, ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తాను సంతోషంగా ఉన్నానని, ఇప్పటి వరకు తనకిచ్చిన బాధ్యతను సమర్థవంగా నిర్వహించానని డీఎల్ తెలిపారు. పదవి భారం అని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌తో తనకే విభేదాలు లేదని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే వారికే వ్యతిరేకినని డీఎల్ రవీంద్ర అన్నారు.పదవుల కోత విషయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, అలా చేయను కూడా అని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్న ప్రభుత్వ పథకాల వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విమర్శించినందు వల్లనే కోత కోస్తే నన్ను పదవి నుండే తప్పించ వచ్చునని అన్నారు. ఆరోగ్య శాఖలో జరిగిన కొన్ని సంఘటనలకు తాను బాధ్యుడిని కానన్నారు. జూడాల విషయంలో నా వైఫల్యం లేదన్నారు. తనది ముక్కుసూటిగా వ్యవహరించే తత్వమని, ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.ఉప ఎన్నికల్లో తన ప్రమేయం ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత వహించాలన్నారు. కడప జిల్లాలో ఆధిపత్యం చూపాలనుకుంటున్న వారు ఉప ఎన్నికల్లో మూడు సీట్లు గెలిపించి తమ సత్తా చూపాలని అన్నారు. పదవిలో కోత విధించి భారం తగ్గించినందుకు సిఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తనను కేబినెట్ నుండి తప్పించినా బాధపడనని, సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు. కాంగ్రెసు వల్లనే తాను ఉన్నత స్థానానికి వచ్చానని అన్నారు.

Monday, 6 February 2012

ఐఎఎస్ అధికారులు పెద్ద చేపలెవరో చెప్పాలి...డిఎల్ రవీంద్రా రెడ్డి

వ్యక్తి స్వార్ధం వల్లనే గత ప్రభుత్వ హాయాంలో వ్యవస్థ నాశనమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. వైఎస్ హయాంలో జరిగిన వాస్తవాలను ఐఏఎస్ అధికారులు నిర్భయంగా వెల్లడించాలని అన్నారు. ఈ సందరర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పులు చేయనప్పుడు అధికారులు బాధపడనవసరం లేదని, నాటి సమయంలో పెద్ద చేపలెవరో, వారి పేర్లను వెల్లడించాలని మంత్రి కోరారు. జూనియర్ డాక్టర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విమరిస్తే చర్చలు జరిపి జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లు విద్యార్థులేనని, ఉద్యోగులు కారని ఆయన అన్నారు. తప్పులు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు

Saturday, 21 January 2012

చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవు...డిఎల్

తిరుపతి శానససభ్యుడు చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విలీనం తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో భాగమని ఆయన అన్నారు. సి. రామచంద్రయ్య విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. రామచంద్రయ్య తనకు మంచి మిత్రుడని ఆయన చెప్పారు. కడప జిల్లా కాంగ్రెసులో కూడా విభేదాలు లేవని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆధిపత్య పోరు సాగుతోందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడానికి మాత్రమే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. రామచంద్రయ్య విషయంలో శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఢిల్లీలో చెప్పినప్పుడు తాను హైదరాబాదు వస్తున్నానను, కూర్చోబెట్టి మాట్లాడిస్తానని ఆజాద్ చెప్పారని, తనకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కాబట్టి తనను కూర్చోబెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రామచంద్రయ్యకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలున్నాయని, అన్ని వర్గాల గురించి రామచంద్రయ్య ఆలోచిస్తారని ఆయన అన్నారు.

Wednesday, 28 December 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ‘ఢీ’

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాదులాటకు దిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డికి, రవీంద్రా రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల ఉద్యోగుల తొలగింపుపై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్కువగా ఉన్న 104 సర్వీసుల ఉద్యోగులను తొలగించాలని రవీంద్రా రెడ్డి పట్టుబట్టగా అలా తొలగిస్తే సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. దీంతో రవీంద్రా రెడ్డి సమావేశం నుంచి మధ్యలో ఆగ్రహంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల్లో హెచ్ఎంఆర్ఐ అవసరానికి మించి ఉద్యోగులను నియమించిందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే విషయంపై పరిశీలిస్తున్నామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో ఏ విధమైన వాగ్వివాదం జరగలేదని ఆయన చెప్పారు. 108 సర్వీసులను నెలలోగా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 104 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలా, కొత్త టెండర్లను ఆహ్వానించాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో జివికె నుంచి 108 సర్వీసులను తప్పిస్తారు.