Showing posts with label మంత్రి శైలజానాథ్. Show all posts
Showing posts with label మంత్రి శైలజానాథ్. Show all posts

Sunday, 20 November 2011

చంద్రబాబూ.. నిజాయితీ నిరూపించుకో:మంత్రి శైలజానాథ్

 తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అవినీతి, ఆరోపణలపై నిజాయితీని నిరూపించుకునే అవకాశం, అవసరం ఉందని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంత్రి విలేఖరులతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేపట్టిందని, సిబిఐ దర్యాప్తుకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబుకు భయంగా ఉంటే కోర్టుకు వెళతారని, నిజాయతీని నిరూపించుకోవాలనుకుంటే విచారణకు సహకరించాలన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. జాతీయస్థాయిలో చర్చ తర్వాతనే పూర్తిస్థాయి నిర్ణయం వస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలతోపాటు కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే మార్పులు చేస్తున్నామని మంత్రి వివరించారు