Showing posts with label పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ. Show all posts
Showing posts with label పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ. Show all posts

Saturday, 11 February 2012

1994 నుంచి భూకేటాయింపులపై విచారణ చేపట్టాలి...విజయమ్మ

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని కొంత మంది శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాగ్, లోకాయుక్త కూడా తప్పు పట్లలేదని ఆమె గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే వైయస్ ప్రభుత్వ హయాంలోని భూకేటాయింపులపై మాత్రమే సభా సంఘం వేశారని విజయమ్మ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులు, రహేజా, ఓడ చెరువు, ఎమ్మార్, శంషాబాద్ విమానాశ్రయం, ఆరు పవర్ ప్రాజెక్టులు, కాకినాడ సీపోర్టు, విశాఖ ప్రాజెక్టు, ఎంఐజి భారత్ వంటి పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయని ఆమె శనివారం నాదెండ్ల మనోహర్‌కు రాసిన లేఖలో తెలిపారు. వివిధ కేసుల్లో సిబిఐ ఐఎఎస్ అధికారులను మాత్రమే విచారించడం సరి కాదని, మిగతావారిని కూడా విచారించాలని ఆమె అన్నారు.భూ కేటాయింపుల సభా సంఘానికి సంబంధించి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఈరోజు ఒక లేఖ రాశారు. 1994 నుంచి అన్ని భూ కేటాయింపులపై సభా సంఘం విచారణ చేపట్టాలని ఆమె కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. సభా సంఘం ఏర్పాటు తనను దిగ్ర్భాంతి కలిగించిందని పేర్కొన్నారు. కాగ్, లోకాయుక్తలే మహానేత డాక్టర్ వైఎస్ ని వేలెత్తి చూపలేదని గుర్తు చేశారు. నిర్ణయం తీసుకున్న 11 నెలలకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కమిటీ విధివిధానాలలో ఇప్పటీకి స్పష్టతలేదన్నారు. టిడిపి హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇదేనని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

Friday, 2 December 2011

వైయస్ విజయమ్మ ఇక ఎమ్మెల్యే కాదు !! ?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే ఆమెపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా శాసనసభ్యులు వరుసగా ఆరు నెలలు అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో వారి సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఉంది. వైయస్ విజయమ్మ శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి శనివారానికి ఆరు నెలలు పూర్తవుతుంది. గత ఆరునెలలుగా ఆమె ఒక్కసారి సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో ఆమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.ఆమెపై వేటు పడే అవకాశాలున్నందున శనివారం ఆమె అసెంబ్లీకి తప్పని పరిస్థితిల్లో హాజరు కావాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గం నుండి గెలిచిన విజయమ్మ ఈ సంవత్సరం జూన్ 3వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా విజయమ్మ రెండో రోజు కూడా సమావేశాలకు హాజరు కాలేదు.