Showing posts with label నటి స్నేహ. Show all posts
Showing posts with label నటి స్నేహ. Show all posts

Wednesday, 9 November 2011

నటి స్నేహ త్వరలో శ్రీమతి కాబోతోంది




హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చకున్న నటి స్నేహ త్వరలో శ్రీమతి కాబోతోంది. తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజు(నవంబర్ 9) ప్రసన్న అధికారికంగా ప్రకటించాడు. ఈ పెళ్లి వార్తను స్నేహ ధృవీకరించింది. 2009లో ఓ తమిళ సినిమాలో స్నేహ, ప్రసన్న కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ జంట తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పెళ్లి గురించి ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ....‘అవును మీడియాలో వస్తున్న వార్తలు నిజమే, నేను స్నేహను పెళ్లి చేసుకోబోతున్నాను, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం’ అంటూ ప్రసన్న ప్రకటించారు. ఇంకా నిశ్చితార్థం తేదీ ఖరారు కాలేదని ప్రసన్న స్పష్టం చేశారు. త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ప్రకటిస్తామన్నారు