Showing posts with label టీమిండియా కెప్టెన్ ధోనీ. Show all posts
Showing posts with label టీమిండియా కెప్టెన్ ధోనీ. Show all posts

Tuesday, 3 January 2012

కెప్టెన్ ధోనీకి ఫెయిర్ ప్లే అవార్డు

కెప్టెన్ కూల్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ ధోనీ 2011వ సంవత్సరానికి గాను ఏఐపిఎస్‌ ఫెయిర్‌ ప్లే అవార్డుని సొంతం చేసుకొని, ఈ అవార్డు అందుకున్న తొలి ప్రపంచ క్రికెటర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. ధోనీకి ఈ అవార్డు రావడానికి గల కారణాలను తెలియజేస్తూ ఇంగ్లాండుతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇయాన్ బెల్ రనౌటైనా తిరిగి వెనక్కి పిలిచి ధోనీ క్రీడా స్పూర్తిని చాటినందుకు గాను అంతర్జాతీయ క్రీడా ప్రెస్‌ సమాఖ్య (ఏఐపిఎస్‌) సెక్రటరీ జనరల్‌ రోస్‌ల్యాన్‌ మోరిస్‌ ఈ అవార్డుని అందజేశారు. ధోనీకి ఈ అవార్డు వచ్చిన సంగతిని మోరిస్‌ ఆదివారం తెలియజేశారు.''జనవరి 13న జరగనున్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ధోనీ హాజరుకావడం లేదు. అందుకే ఆదివారం సిడ్నీలోని షేర్‌టాన్‌ హోటల్‌లో ధోనీకి మెమో అందజేశాం'' అని మోరిస్‌ తెలిపారు. ఏప్రిల్‌ 4, 2012న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభోత్సవ వేడులో ధోనీకి ట్రోఫీని అందజేస్తామని మోరిస్‌ పేర్కొన్నారు.