యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన తాజా సినిమా ‘దమ్ము’చిత్రంలో ద్విపాత్రాభినయం
చేస్తున్నారా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. దమ్ము చిత్రం
యూనిట్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్
ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా,
మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే
ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా
దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని
ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా...పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే
ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి
శ్రీను ఇప్పటికే యాక్షన్ సన్ని వేశాలను ఫర్ ఫెక్ట్ గా తెరకెక్కించారని,
ప్రస్తుతం టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ప్రస్తుతం దమ్ము
చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
Showing posts with label జూ ఎన్టీఆర్. Show all posts
Showing posts with label జూ ఎన్టీఆర్. Show all posts
Saturday, 21 January 2012
Tuesday, 3 January 2012
తారకరత్నపై జూ ఎన్టీఆర్ సీరియస్!
Saturday, 22 October 2011
ఎన్టీఆర్ మాత్రం తాప్సీకి నో చెపున్నారు
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో శృతిహాసన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అలాగే ఆమె పదిరోజుల షూటింగ్ లో కూడా పాల్గొంది.అయితే షూటింగ్ ని ఊసరవెల్లికి బ్రేక్ ఇచ్చి ప్రారంభించటంతో ఆమె సారి చెప్పి బై చెప్పిందని సమాచారం. ఆమె తనకు డేట్స్ లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె వాలంటరిగా టీమ్ కి గుడ్ లక్ చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యూ కాలేదు.
ఇప్పుడు ఆమె ప్లేసులోకి ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. రాధిక కూతురు, జోష్ హీరోయిన్ కార్తీక అని, హన్సిక అని ఫిల్మిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే కాజల్ కావచ్చు అని మరి కొంతమంది చెప్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తాప్సీని హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ఈ చిత్ర నిర్మాత కెయస్ రామారావు సన్నాహాలు చేసాడట. జూ ఎన్టీఆర్ కి అయితే బల్క్ డేట్స్ కేటాయించడానికి నేను రెడీ అని తాప్సీ చెప్పిందట. కానీ ఎన్టీఆర్ మాత్రం తాప్సీకి నో చెప్పి కాజల్ కి ఓకే చెప్పినట్టు వార్తలు అందుతున్నాయి. కాజల్ కి ఎన్టీఆర్ ఓటేయ్యడంతో చేసేదిలేక ఈ చిత్ర దర్శక, నిర్మాతలు కూడా కాజల్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అలాగే సెకెండ్ హీరోయిన్ గా కూడా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పటకీ తేలలేదు
Subscribe to:
Posts (Atom)
