Showing posts with label చిరంజీవి. Show all posts
Showing posts with label చిరంజీవి. Show all posts

Wednesday, 7 December 2011

మంత్రివర్గ విస్తరణ లో మెగా ప్యాకేజీ….?

డిసెంబరు రెండో వారంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రోశయ్య హయాంలో పనిచేసిన మంత్రులనే నేటికీ కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలొచ్చాయి. అయితే సకలజనుల సమ్మె, తెలంగాణా సమస్య తీవ్రం కావడంతో విస్తరణ వాయిదా పడింది .ఇక జాక్‌పాట్ కొట్టింది మెగాస్టారే. ఎందుకంటే మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా చిరంజీవి బ్యాచ్ అలక వహించి నేరుగా హైకమాండ్ నుంచి పెద్ద హామీలనే పొందింది. మెగా ప్యాకేజీనే దక్కించుకుంది. మంత్రివర్గ విస్తరణలో పిఆర్పీ ఎమ్మెల్యేలు ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాన్నది వారి డిమాండ్. అంతకు ముందు ఇద్దరికి మంత్రి పదవులిస్తే చాలన్న చిరు మొన్న అవిశ్వాస తీర్మానం తర్వాత ఐదుగురికివ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన ఉంచారు. ఇందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చిరుకు ఆమేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే తూర్పు, విశాఖలోని ఇద్దరు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదు. మొత్తం మీద చిరు బ్యాచ్ జాక్ పాట్ కొట్టిందని చెప్పక తప్పదు

Tuesday, 6 December 2011

త్వరలో చిరంజీవి 150వ సినిమా మురుగదాస్ ద్శకత్వం?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 150వ సినిమా డైరెక్ట్ చెయ్యబోతున్నారంటూ చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆ మధ్య వివి వినాయక్ ఫైనల్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే మతాజా సమాచారం ప్రకారం గజిని, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఎఆర్ మురుగదాస్ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. సెవెన్త్ సెన్స్ తర్వాత చిరంజీవి ఆబ్లిగేషన్ వల్ల మురుగదాస్ కి అతని 150వ చిత్రానికి స్ర్కిప్ట్ రెడీ చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందట. గతంలో చిరంజీవితో స్టాలిన్ చేసిన మురుగదాస్ ఇప్పుడు 150వ సినిమాకి కూడా స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాడని, త్వరలోనే అతని డైరెక్షన్ లో సినిమా ప్రారంభం కాబోతోందన్న వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది.

Saturday, 12 November 2011

ఆరు నెలలలో చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి?

ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేసిన చిరంజీవిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనను తుడిచిపెట్టడానికి కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అది కూడా సాధ్యమైనంత త్వరగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన సాగుతోంది. రాజ్యసభకు గానీ లోకసభకు గానీ ఎంపిక కాక ముందే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోగా పార్లమెంటు ఉభయసభల్లో దేనికైనా ఒకదానికి ఎంపికైతే చాలు. అందువల్ల ముందు చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన సాగుతోంది. ఏప్రిల్ లేదా మేలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయిస్తారని అంటున్నారు

Sunday, 23 October 2011

చిరంజీవి సినిమా స్క్రిప్టు ఓకే చేసారు

                                
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల శివ రాసారు. కోన వెంకట్ డైలాగులు రాసారు.కాజల్ హీరోయిన్ గా చేయబోయే ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఈ చిత్రం అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ నిర్మించే చిత్రంలో రామ్ చరణ్ చేస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ మరో ప్రక్క రచ్చ చిత్రం బిజీలో ఉన్నారు. ఆ చిత్రం జనవరిలో విడుదల చేయాలని నిర్ణంయించుకున్నారు. ఏమైంది ఈ వేళ తో ప్రతిభావంతుడైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న సంపత్‌నంది ఈ చిత్రానికి దర్శకుడు. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పారాస్‌జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.. శ్రీలంక, బ్యాంకాక్‌ల్లో ఇప్పటికే భారీ షెడ్యూల్స్ చేశారు.