Showing posts with label చిత్రం. Show all posts
Showing posts with label చిత్రం. Show all posts

Wednesday, 30 November 2011

బెజవాడ రిలీజ్... పోలీసులు అప్రమత్తం

నాగచైతన్య తాజా చిత్రం   బెజవాడ రిలీజ్ అవుతోందంటే బెజవాడలో భయం మొదలైంది. మళ్ళీ ఏ గొడవలు మొదలవుతాయో, కులాల మధ్య కొట్లాటలు ప్రారంభమవుతాయో అని అంతా భయపడుతున్నారు. మరో ప్రక్క పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలని పైనుంచి ఆర్డర్స్ ఉండటంతో బెజవాడ విడుదలైన మూడు రోజుల వరకూ చాలా జాగ్రత్తగా అన్ని చోట్లా కన్నేసి ఉంచుతున్నారు. అల్లరి మూకలు చెలరేగి పోకుండా ఉండేందుకు వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు అప్రకటిత 144 సెక్షన్ నడిచే అవకాశముందని తెలుస్తోంది. ధియోటర్స్ వద్ద కూడా పెద్ద హంగామా జరపకూడదని ధియోటర్స్ ఓనర్స్ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వంగవీటి రంగా వర్గీయులు ఈ చిత్రంలో తమ కాపు కులాన్ని తక్కువ చేసి చూపెట్టినా,రంగాని సరిగ్గా చూపకపోయినా ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరో వర్గం అయితే ఆ చిత్రంలో తమ వారిని బాగా చూపెట్టారని బ్యానర్స్ కట్టి మరీ సంతోషం వెల్లబుచ్చుతోంది. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని అంతా భయం భయం గా చూస్తున్నారు.