Showing posts with label క్రికెటర్ల. Show all posts
Showing posts with label క్రికెటర్ల. Show all posts

Friday, 24 February 2012

సచిన్‌కు ఎవరి సలహాలు అక్కర్లేదు...వెంగ్ సర్కార్

ఎప్పుడు రిటైర్ కావాలనే విషయమై సచిన్‌కు ఎవ రూ సలహాలు ఇవ్వనక్కర్లేదని మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నాడు. 39 ఏళ్ల వయస్సులో కూడా సచిన్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడన్నాడు. ఒకవేళ సచిన్ రిటైరైనా..అతని స్థానాన్ని భర్తీచేసే ఆటగాడు లేనేలేడని వెంగీ చెప్పాడు. సచిన్ తక్షణమే వన్డేలనుంచి రిటైర్ కావాల్సిందిగా మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సూచించిన సంగతి తెలిసిందే. మాస్టర్ స్దానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యమేనని వెంగ్ సర్కార్ తెలిపాడు. సచిన్‌కి ఎప్పుడు రిటైర్ కావాలో బాగా తెలుసని, ఇందులో ఎవరి సలహాలు అక్కర్లేదని అన్నారు. ఇటీవల కపిల్ దేవ్ మాట్లాడుతూ సచిన్ ప్రపంచకప్ తర్వాత రిటైర్ కావాల్సిందన్న విషయం తెలిసిందే. ముక్కోణపు టోర్నీల వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సచిన్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాలని కపిల్‌దేవ్‌ చేసిన సూచనను వెంగ్‌సర్కార్‌ తప్పు పట్టాడు. సచిన్‌ ఫిట్‌నెస్‌పై ఎవరు సందేహించాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు మొత్తం వైఫల్యం చవిచూస్తున్నప్పుడూ ఒక్క సచిన్‌పైనే విమర్శలు చేయడం తగదన్నాడు. సచిన్‌పై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వెంగ్‌సర్కార్‌ పరోక్షంగా కపిల్‌ని ఉద్దేశించి అన్నాడు. 39 యేళ్ల వయసులోనూ సచిన్ చక్కని ఫిట్‌ నెస్‌తో... ఆటతీరుని ప్రదర్శిస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలని అన్నాడు. పైగా భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్‌ వన్డేలకు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వెంగీ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆటగాళ్లలో సచిన్‌ ఒకడు. క్రికెట్ ఆట పట్ల సచిన్ అంకిత భావం, నిబద్దత.. ఆడిన ఆట భవిష్యత్ తరాలకు ఆదర్శమని వెంగ్ సర్కార్ కొనియాడారు.

Wednesday, 22 February 2012

టీమిండియా క్రికెట్ జట్టులో అంతర్గత పోరు!

టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు. మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు చేశాడు. ఫీల్డింగ్‌లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను ధోనీ ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని సెహ్వాగ్ చెప్పాడు.సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని, సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి పాలైన తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Saturday, 7 January 2012

సిడ్నీటెస్టులో చెరిగి పోయిన రికార్డులు!

సిడ్నీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు బ్రాడ్‌మన్ సహా పలువురి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించాడు. గురువారం మూడో రోజు లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికి క్లార్క్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ పూర్తి చేయగానే క్లార్క్ ఆనందంతో పిడికిలి బిగించి గాలిలోకి పంచ్ చేస్తూ గంతులు వేసాడు. ఈ క్రమంలో క్లార్క్ ఆస్ట్రేలియా-్భరత్ టెస్టు సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్ సాధించిన 281 పరుగుల అత్యధిక వ్యక్తిగత రికార్డును అదిగమించడమే కాకుండా సొంత గడ్డపై ఆస్ట్రేలియా కెప్టెన్‌గా డాన్‌బ్రాడ్‌మన్ సాధించిన 270 పరుగుల రికార్డును కూడా అధిగమించాడు. 1936నుంచి బ్రాడ్‌మన్ రికార్డు అలాగే ఉండడం గమనార్హం.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 109 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రెగ్ ఫాస్టర్ నెలకొల్పిన 297 పరుగుల అత్యధిక స్కోరును సైతం క్లార్క్ చెరిపివేసినప్పుడు స్టేడియంలోని వేలాది మంది అభిమానులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతనికి అభినందనలు తెలియజేసారు. వాస్తవానికి క్లార్క్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన 334 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును సైతం అధిగమించే అవకాశముండింది. అయితే ఉద్దేశపూర్వకంగానో లేదా మరే కారణం చేతనో ఆ రికార్డుకు అయిదు పరుగుల దూరంలో ఉండగానే క్లార్క్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా బ్రాడ్‌మన్ రికార్డును సమం చేయగానే ఉద్దేశపూర్వకంగానే జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బ్రాడ్‌మన్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు క్లార్క్ సైతం అదే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే రికార్డులకన్నా జట్టు విజయమే తనకు ప్రధానమని, అందుకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసానని క్లార్క్ చెప్పడం విశేషం.వ్యక్తిగత రికార్డులకన్నా టీమ్ ప్రయోజనాలే ముఖ్యంగా భావించినందుకు క్లార్క్‌పై మార్క్ టేలర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. బ్రాడ్‌మన్ రికార్డునే కాదు తలచుకుని ఉంటే టెస్టు క్రికెట్‌లో బ్రియాన్ లారా నెలకొల్పిన 400 పరుగుల ప్రపంచ రికార్డును సైతం అధిగమించి ఉండే వాడని టేలర్ అన్నాడు. కనీసం జింబాబ్వేపై 380 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా హేడన్ నెలకొల్పిన రికార్డునైనా అధిగమించి ఉండేవాడని, అయితే మ్యాచ్‌లో జట్టు విజయం సాధించడమే ముఖ్యమని భావించిన క్లార్క్ ఆ రికార్డులేవీ పట్టించుకోకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని టేలర్ ప్రశంసించాడు.ఎస్‌సిజిలో చేసిన తొలి ట్రిపుల్ సెంచరీతోనే అనేక రికార్డులు బద్దలు కొట్టిన క్రికెటర్‌గా క్లార్క్ చరిత్ర సృష్టించినప్పటికీ అతని బ్యాట్‌కు స్పాన్సర్స్ ఎవరూ లేక పోవడం విశేషం. నాలుగు రోజుల ముందే డన్‌లప్ స్లేజెంజర్ క్లార్క్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందంనుంచి వైదొలగింది