Showing posts with label కడప పార్లమెంటు సభ్యుడు జగన్‌. Show all posts
Showing posts with label కడప పార్లమెంటు సభ్యుడు జగన్‌. Show all posts

Saturday, 24 December 2011

కిరణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన.... వైయస్ జగన్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన శనివారం కడప జిల్లాలో పర్యటించారు. రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పు లేదని ఆయన విరుచుకుపడ్డారు. కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి గ్రామంలో ానయ ఉల్లి పంటను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కాని పరిస్థితిలో రైతు ఉన్నాడని ఆయన అన్నారు. పది నెలలు వ్యవసాయ శాఖకు మంత్రి లేడని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌ను నియమించలేదని, ఇంతటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు వైయస్ జగన్ పులివెందులలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు, శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా వైయస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆమె శనివారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్ విజయమ్మ కోడలు భారతి కూడా వైయస్సార్‌కు నివాళులు అర్పించారు.

Wednesday, 7 December 2011

రైతు బాధలు చూస్తే గుండె పగులుతోంది....జగన్‌మోహన్‌రెడ్డి

జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తే గుండెలు పగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌ఆర్ బతికి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందించని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించే నిమిత్తం ప్రవేశపెట్టిన 108 అంబులెన్సుల నిర్వహణ లోపానికి తోడు, పేదలకు ఉచిత వైద్యాన్ని కూడా సరిగా ప్రభుత్వం అందించలేకపోతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రతి పేదవాడికీ ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోందన్నారు. పేదవాడి గుండె చప్పుడు వినేందుకు ప్రభుత్వానికి ఓపిక లేకుండా పోతోందన్నారు. రచ్చబండ నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తున్నవారికే కార్డులు, పింఛన్లు అందజేస్తున్నారని విమర్శించారు. కనీసం ప్రతిపక్షమైనా ప్రభుత్వ తీరుపై పోరు చేస్తుందనుకుంటే ప్రభుత్వంతో అది కుమ్మక్కైన తీరును చూస్తున్నామన్నారు.

Tuesday, 6 December 2011

అనర్హత వేటు వేయండి...ఉప ఎన్నికలకు సిద్ధం ...వైఎస్ జగన్‌

అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటన అని వైఎస్ఆర్ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తొలి సారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు పోతాయని తెలిసినా ప్రజల పక్షాన నిలబడిన తన ఎమ్మెల్యేలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో అవిశ్వాసానికి మద్దతు తెలిపామని ఆయన పేర్కొన్నారు. అసలు అసెంబ్లీలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టారా లేక రైతు సమస్యలపై పెట్టారా అని అనుమానం వచ్చిందని జగన్ అన్నారు. దివంగత నేతను తిట్టేందుకే చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారని, తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు రెచ్చగొట్టారని విమర్శించారు.

Saturday, 3 December 2011

జగన్ సమావేశానికి హాజరైన 22 మంది ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి 22 మంది శానససభ్యులు వచ్చారు. గుంటూరు ఓదార్పు యాత్రను విరమించుకుని వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాదు వచ్చారు. శనివారం ఉదయం తన వర్గానికి చెందిన శానససభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో 9 మందే ఉన్నప్పటికీ ఆ సంఖ్య 21కి చేరుకుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత, శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, సత్యవతి, బాబూరావు, పూతలపట్టు రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు సమావేశానికి వచ్చారు. సమావేశానికి వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ధర్నాన కృష్ణప్రసాద్, చెన్నకేశవ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి కూడా ఉన్నారు. ప్రసాద రాజు, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, బాలనాగి రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆయన వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తిడుతూ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం సరి కాదనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. ధర్మాన కృష్ణ ప్రసాద్ మాటలను బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

Sunday, 30 October 2011

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఆదివారం ప్రసారం చేసింది. అనుమతులకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వ భవనంలో ఉంటున్నారని, అందుకు ఆయన మూడు లక్షల రూపాయలు కేంద్రానికి బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు మాత్రమే కేటాయించే భవనాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం వైయస్ జగన్‌కు కేటాయించింది. కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఆ భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకుగాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. 

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెసు నేత జి. వెంకటస్వామి కూడా తనకు గతంలో కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకు గాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి రూ. 30 లక్షలు బాకీ పడ్డారని ఆ తెలుగు టీవీ చానెల్ తెలిపింది. ఇదిలా వుంటే, వార్త దినపత్రిక అధిపతి, మాజీ పార్లమెంటు సభ్యుడు గిరీష్ సంఘీ కూడా అనుమతులకు విరుద్ధంగా ఓ భవనంలో ఉన్నారని చెప్పింది. అయితే, ఆయన చెల్లించాల్సిన బాకీ ఏమీ లేదని తెలుస్తోంది