Showing posts with label అసిన్. Show all posts
Showing posts with label అసిన్. Show all posts

Saturday, 24 December 2011

రజనీతో వర్క్ చేయడమంటే చాలా ఇష్టం...అసిన్

రజనీతో వర్క్ చేయడమంటే చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడాన్ని ప్రేమిస్తాను. ఓ మంచి 'స్రిప్టుతో రూపొందే చిత్రంలో రజనీతో నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆయనతో నటించే అవకాశం లభిస్తే దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోను. కానీ ఇప్పటి వరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు’ అంటూ రజనీకాంత్ పై తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది అసిన్. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా....తమిళ్ లో కొచ్చాదయాన్ అనే 3డి చిత్రం రూపొందుతోంది. రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తన్న ఈ చిత్రంలో రజనీ చెల్లెలు పాత్రను స్నేహ పోషిస్తుండగా, ఐశ్వర్య రాయ్ మరో ముఖ్యమైన అతిథి పాత్రలో దర్శనం ఇవ్వనుందనే వార్తలు వనిపిస్తున్నాయి. వీరితో పాటు ఇందులో అసిన్ కూడా నటించే అవకాశ ఉందని, నిర్మాతలు ఈ మేరకు ప్రత్నాలు చేస్తున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అసిన్ పై విధంగా స్పందించింది.