Thursday, 15 December 2011

బ్రహ్మిణి స్టీల్స్‌ను తరలిస్తే ఊరుకోం

బ్రహ్మిణి స్టీల్స్‌ను వేరే ప్రాంతాలకు తరలిస్తే ఊరుకునేది లేదని రాయలసీమ హక్కుల నేత పీహెచ్ చంద్రశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెయిల్ కంపెనీ ద్వారా బ్రహ్మిణి స్టీల్స్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.  రాయలసీమ ప్రజలకు మేలు చేసే బ్రహ్మిణి స్టీల్స్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు. రాజకీయ విభేదాలతో బ్రహ్మిణిని తరలిస్తే రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుందన్నారు.

No comments:

Post a Comment