
మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్
ప్రభుత్వంపై ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైఎస్
విజయమ్మ ఓటేస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని
రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటి ఛైర్మెన్ నర్రెడ్డి తులసి రెడ్డి
పేర్కొన్నారు. చంద్రబాబుతో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వస్తుందా
వ్యతిరేకంగా ఓటు వేస్తుందా అన్నది విజయమ్మ ఇష్టమేనని అనుకూలంగా వేస్తే
చంద్రబాబుతో కుమ్మక్కు అయినట్లేనని ఆయన పేర్కొన్నారు.
ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానం
టీకప్పులో తుఫాను లాంటిదని వంద శాతం వీగిపోతుందని జోష్యం చెప్పారు.అవిశ్వాసంలో నెగ్గాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని జగన్ వర్గ ఎమ్మెల్యేలు ,
తెలంగాణా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడానికేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు, ఉప ఎన్నికలకు వెళ్లేందుకు
సిద్దంగా లేరని రెండున్నర సంవత్సరాల మిగతా కాలం పూర్తి చేయాలనే భవనతో
ఉన్నారని తెలియజేశారు. ప్రజాహిత కార్యక్రమాలు తమ నియోజక వర్గాల్లో
చేసుకోవాలనే ఆలోచనలు చేసి తద్వారా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని
కోరుకుంటున్నారు తప్ప అర్దాంతరంగాఎవ్వరూ ఎన్నికలు కోరుకోవడం లేదని
తెలియజేశారు. వైఎస్ జగన్ వర ఎమ్మెల్యేలు విజయమ్మ, అవిశ్వాస
తీర్మాణానికి అనుకూలంగా ఓట్లు వేస్తారా, వ్యతిరేకంగా ఓట్లు వేస్తారన్నది
వారి ఇష్టమేనని తెలియజేశారు.
No comments:
Post a Comment