'శ్రీరామరాజ్యం' పుస్తక రూపంలో
బాపు,బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రం
జనవరి 5 నాటికి మా చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. ఈ సందర్భంగా ఈ
చిత్రంలోని ముఖ్య ఘట్టాలతో బాపు బొమ్మలతో ఓ పుస్తకం రూపొందించటానికి
సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. గతంలోనూ బాపు చిత్రాలకు ఇలాంటి
పుస్తకాలు విడుదల చేసి ప్రమోట్ చేసే ప్రయత్నం చేసారు. ఇక ఈ విషయాన్ని
తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాత యలమంచిలి సాయిబాబా
మాట్లాడుతూ...రామాయణంలోని గొప్పదనాన్ని ఈతరానికి చెప్పేందుకు చేసిన
ప్రయత్నం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రానికి వస్తున్న స్పందన సంతృప్తి
కలిగించింది. మా ఉద్దేశం నెరవేరినందుకు ఆనందంగా ఉంది. జనవరి 5న ఈ చిత్ర
విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహించనున్నాం. భక్తి భావంతో నిర్మించిన
సినిమా ఇది. ఇంటిల్లిపాదీ చూసేలా బాపు తీర్చిదిద్దారు. జనవరి 5 నాటికి మా
చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. చిత్ర కథను సంక్షిప్తంగా
వివరించే పుస్తకాన్ని చిన్నారుల కోసం రూపొందించాం. బాపు బొమ్మలతో దీన్ని
తీర్చిదిద్దాం. పాఠశాల విద్యార్థులకు వాటిని అందజేస్తున్నామని అన్నారు.
No comments:
Post a Comment