భారత వీసాలను పొందాలనుకుంటే ఇక నుంచి విదేశీయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని
దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ఆన్‌లైన్ దరఖాస్తు కేంద్రాలను
ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో
ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని భారత కాన్సులేట్ జనరల్ ప్రారంభించారు.
" వీసా కావాలనుకునే వారు వెబ్‌సైట్‌లో సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి,
ప్రింట్ తీసుకోవాలి. ఏదైనా వీసా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ వద్ద ఆ దరఖాస్తును,
రుసుము ను చెల్లించాలి''అని ఆయన చెప్పారు. వీసాల దరఖాస్తులన్నింటినీ
ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జనవరి 1 నుంచి
అమల్లోకి రానుందని తెలిపారు.
No comments:
Post a Comment