Monday, 12 December 2011

చరణ్ కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు...రాణా

ఇటీవల రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ ఉపాసనతో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్ళి తేదీ ఇంకా ప్రకటించలేదు గానీ..రెండు కుటుంబాలు పెళ్ళికి సంబంధించిన చర్చలు ముమ్మరంగా జరుపుతున్నారని వినికిడి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన రాణా ఓ గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసాడట. ఈ పార్టీ చరణ్ కోసం అరేంజ్ చేసాడని తెలుస్తోంది. ఇది బ్యాచులర్ పార్టీ అని సమాచారం.ఈ వీకెండ్ లో జరుగుతున్న పార్టీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రానా దగ్గరుండి చూసుకున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం డిపార్ట్ మెంట్ షూటింగ్ లో బిజీగా ఉన్న రాణా ముంబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడట. దాదాపు 15మంది క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా 40మంది స్టార్స్ ఈ పార్టీలో పాల్గొంటున్నారని వినికిడి. వీకెండ్ లో ఆరంభమయ్యే ఈ పార్టీ సోమవారం తెల్లవారే వరకూ జరుగుతుందని తెలుస్తోంది.

100 మంది హీరోలతో క్రికెట్ లీగ్ (సీసీఎల్) ఒకే వేదికపై...!

దక్షిణ భారత, హిందీ సినీ పరిశ్రమకు చెందిన సినీ తారలతో నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సక్సెస్ అయిన నేపథ్యంలో రెండవ సీజన్ సీసీఎల్ సిరీస్ జనవరి 13న షార్జాలో ప్రారంభంకానుంది. లీగ్ ప్రమోషన్లో భాగంగా కర్టెన్ రైజర్ మ్యాచ్ ఈ నెల 19న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెక్షన్ సెంటర్‌లో జరుగనుంది. ఆరు చిత్ర పరిశ్రమలకు చెందిన 100 మంది హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. భారత దేశ సినీ చరిత్రలోనే ఇంత మంది హీరోలు ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి కాబోతోంది. సీసీఎల్ మొదటి సీజన్‌లో నాలుగు చిత్ర రంగాలకు చెందిన జట్లు టైటిల్ కోసం తలపడితే, ఈ రెండవ సీజన్‌లో బెంగాలీ, మలయాళీ చిత్ర రంగాల నుంచి అదనంగా మరో రెండు జట్లు పాల్గొనబోతున్నాయి. బెంగాల్ టైగర్స్ జట్టును బోనీకపూర్, శ్రీదేవిలు సొంతం చేసుకోగా, కేరళ స్ట్రయికర్స్ జట్టును మోహన్‌లాల్, లిజీ ప్రియదర్శన్‌లు సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. తొలి మ్యాచ్ ముంబయ్ హీరోస్, గత ఛాంపియన్ చెన్నయ్ రైనోస్ జట్ల మధ్య జనవరి 13న షార్జాలో జరుగనుంది. ప్రాంతీయ భాషా చిత్రాల తారలను దేశవ్యాప్త ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు, జాతీయ స్థాయి తారలను ప్రాంతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు అనువైన వేదికగా సీసీఎల్ పేరు సంపాదించుకుంది.